మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో వస్తున్నాడు.రవితేజ కు ఇది 75వ సినిమా.సూపర్ హిట్ మూవీ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతరతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈనెల 27న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ జారీచేయగా 2గంటల 40 నిమిషాల రన్ టైం తో థియేటర్లోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా తనకు జంటగా శ్రీలీల నటించింది. వీరిద్దరికి ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో ధమాకా రాగ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.మాస్ జాతర కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈనెల 31న థియేటర్లలోకి వస్తుంది.
ఇక ధమాకా తరువాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు రవితేజ. ఇక ఇప్పుడు ఈ మాస్ జాతర తనైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.సినిమా కూడా బాగా వచ్చిందని టాక్. అయితే ఈసినిమా విడుదలవుతున్న రోజే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతుంది. దాంతో మాస్ జాతర కు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























