ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈనెల 17న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న దీపావళి సందర్భంగా హాలిడే కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 83 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 60 శాతం పైగా రికవరీ చేసింది.ఈ వారంలో 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చి క్లీన్ హిట్ గా నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లోకూడా ఈసినిమా అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో 4 రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇక ఈసినిమాతో ప్రదీప్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు వరుసగా మూడో సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి ఏ హీరోకి లేని రికార్డును సృష్టించనున్నాడు.కెరీర్ లో ఇప్పటివరకు అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు ప్రదీప్.మరి డ్యూడ్ ఫుల్ రన్ లో తన కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.
కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























