యూఎస్ఏలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు సెన్సేషనల్ బుకింగ్స్

Baahubali The Epic Gets Sensational Bookings in the USA

ప్రైడ్ ఆఫ్ ఇండియన్  మూవీస్  బాహుబలి 1& 2  రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్  గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.ఇక  ఈ రీ రిలీజ్ పై భారీ అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అడ్వాన్స్ సేల్స్ 100K$ మార్క్ ను దాటేసింది. మరి ప్రీమియర్స్ రోజు  వరకు ఎంత రాబట్టుకుంటుందో చూడాలి.ఈనెల 29నే ఓవర్సీస్ లో  ప్రీమియర్స్ పడనున్నాయి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే  ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.3 గంటల 44 నిమిషాల రన్ టైం తో  రానుంది.ట్రెండ్ చూస్తుంటే బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాయనుంది.దాదాపు ఈసినిమా 50 కోట్ల  వరకు రాబట్టే ఛాన్స్ లేకపోలేదు.ఇక సరిగ్గా 10 ఏళ్ళ క్రితం థియేటర్లలోకి వచ్చిన బాహుబలి 1 ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది.ఈసినిమా దాదాపు 650 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి  చరిత్ర సృష్టించింది.ఆ తరువాత బాహుబలి సీక్వెల్ కోసం దేశమంతా ఎదురుచూసింది.

ఇక  2017లో వచ్చిన  సీక్వెల్ బాహుబలి 2 సృష్టించిన విధ్వసం అంతా ఇంత కాదు.దాదాపు 1800కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అగ్ర దర్శకుడు రాజమౌళి ఈసినిమాలను డైరెక్ట్ చేయగా రెబల్ స్టార్ ప్రభాస్ ,రానా ,అనుష్క ,రమ్యకృష్ణ ,నాజర్ తదితరులు నటించారు.కీరవాణి సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.