టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల తార అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘స్ట్రీమింగ్ వివరాలు
కిష్కింధపురి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘జీ5’ (ZEE5) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నేటినుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఆదివారం నుండి Z తెలుగు టీవీ ఛానల్ లోనూ ప్రసారం కానుంది. సో, థియేటర్లో మిస్ అయిన హారర్ ప్రియులు, ఈ సినిమాను ఇంట్లో కూర్చుని చూసి ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం.
కథాంశం ఏమిటంటే..?
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, రాఘవ (బెల్లంకొండ శ్రీనివాస్) మరియు మైథిలి (అనుపమ పరమేశ్వరన్) అనే ఇద్దరు ‘ఘోస్ట్ వాకింగ్ టూర్’ నిర్వాహకుల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ టూర్లో భాగంగా ‘సువర్ణ మాయ’ అనే రేడియో స్టేషన్కి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఒక ఆత్మను మేల్కొలపడంతో, ఆ బృందానికి ఎదురైన భయంకర సంఘటనలు, ఊహించని మలుపులతో ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠను పంచుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























