చరిత్ర సృష్టించిన కొత్త లోక 

Record-Breaking Run for Kotha Lokah

చిన్న సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది మలయాళం సినిమా  లోకః చాప్టర్ 1 – చంద్ర.ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు చివర్లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 45 రోజుల్లో 300కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం హైయెస్ట్ మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మాలీవుడ్ లో ఇదే  మొదటి 300కోట్ల సినిమా. కేవలం 2కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఊహించని రన్ తో ఏకంగా 300కోట్ల  సినిమాగా చరిత్ర సృష్టించింది.కేరళ లోనూ  ఈసినిమా 120 కోట్ల వసూళ్లతో ఆల్ టైం హైయెస్ట్  గ్రాసర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 తెలుగులో ఈసినిమా కొత్త లోక గా విడుదలై హిట్ అనిపించుకుంది.ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశాడు. ఇక ఈసినిమా ఓటీటీ రైట్స్ జియో హాట్ స్టార్ దక్కించుకుంది.దీపావళి తరువాత అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. 

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు.ఇక లోక పార్ట్  2 కూడా అనౌన్స్ చేశారు.ఇందులో టొవినో థామస్ హీరోగా నటించనున్నాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.