ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన కొత్త లోక

Kotha Lokah Creates All-Time Record in kerala

ఆగస్టు చివర్లో ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చి  ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మలయాళ  మూవీ లోక చాప్టర్ 1 – చంద్ర.6కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా నిన్నటి  వరకు 298 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.రేపటి తో 300కోట్ల క్లబ్ లో చేరనుంది.మలయాళంలో ఇదే మొదటి  300కోట్ల సినిమా. ఇక  ఈసినిమా కేరళలోనూ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా  రికార్డు సృష్టించింది.నిన్నటితో అక్కడ 119కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇంతకుముందు మోహన్ లాల్ తుడరమ్ 118కోట్ల వసూళ్లతో హైయెస్ట్ గ్రాసర్ గా ఉండగా లోక  ఆ రికార్డు  బ్రేక్ చేసింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విడుదలై  నెలరోజులకుపైగా అవుతున్న ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటూ లోక  రికార్డులను  తిరగరాస్తుంది.త్వరలోనే ఈసినిమా ఓటీటీ లోకి రానుంది.భారీ ధరకు జియో హాట్ స్టార్ట్ ఈసినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుందని సమాచారం.దీపావళికి ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ వుంది.ఇక ఈసినిమా తెలుగులో  కొత్త లోక గా విడుదలై సూపర్  హిట్ అనిపించుకుంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశారు. 

దాదాపు  40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది.మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వే ఫెరర్ ఈసినిమాను నిర్మించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది.సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.