మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఆయనకి ఇది 75వ సినిమా కావడం విశేషం. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా.. అవి సినీ ప్రియుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి మరో కొత్త పాట విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. దీనిలో భాగంగా నేడు ఆ పాటకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇంతకుముందు పాటలు రెండూ ఫుల్ మాస్ బీట్‌లు కాగా, ఈసారి మంచి మెలోడీ సాంగ్‌ను విడుదల చేయడం గమనార్హం. ‘హుడియో హుడియో’ అంటూ సాగే ఈ కొత్త పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేసేలావుంది. ఇక ఈ పాటకు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన స్వరాలను స్వరపరచగా.. మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించడం విశేషం.
ఈ ‘హుడియో హుడియో’ పాట త్వరలోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, ఇది సినిమాలో కీలక సమయంలో హీరో,హీరోయిన్ మధ్య వచ్చే పాట అని చిత్ర బృందం తెలిపింది. ఇక రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, ఈ కొత్త పాటలో కొత్త మెలోడీ టచ్ ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది. దీంతో, ఈ రొమాంటిక్ మెలోడీ పూర్తి పాట విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మరో రెండు రోజుల్లో, అనగా.. అక్టోబర్ 8న ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























