పర్ఫెక్ట్ రన్‌ టైమ్‌తో వస్తున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’

Dhanush's Directorial Idli Kottu Locks Perfect Runtime

కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో ధనుష్ ప్రతి సినిమా కోసం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటాడు. తాజాగా ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు పర్ఫెక్ట్ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే — చిన్న రన్‌టైమ్‌తోనే సినిమాలు వేగంగా నడిపించడమే. కానీ ధనుష్ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, ఎమోషన్‌కు కావల్సినంత స్పేస్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ రన్‌టైమ్‌ను కచ్చితంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 147 నిమిషాలు (2 గంటలు 27 నిమిషాలు) నిడివితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి. ఈ తరుణంలో రన్‌టైమ్ 2 గంటలు 27 నిమిషాలే అనగానే ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అయ్యారు. “ఇడ్లీ కొట్టు అంటేనే ఎనర్జీ.. రన్‌టైమ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది.. ఇప్పుడు థియేటర్లో ధనుష్ మాస్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి, పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో ‘ఇడ్లీ కొట్టు’ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫుల్ మీల్స్‌గా దొరకబోతుందనడంలో సందేహం లేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.