కుబేర తరువాత తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ ఇడ్లీ కడై తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.అక్టోబర్ 1 న విడుదలకు రెడీ అవుతుంది.అందులో భాగంగా ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.ఇడ్లి కడై క్లీన్ యు సర్టిఫికెట్ తో రిలీజ్ కానుంది.ఇందులో ధనుష్ హీరోగా నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జీవీ ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది.తెలుగులో ఈసినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో విడుదల చేస్తుంది. అయితే ఈసినిమా కు ఒక్క రోజు గ్యాప్ తో కన్నడ మూవీ కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వస్తుండడంతో ఈ సినిమాకు భారీ హైప్ వుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఇడ్లీ కొట్టు కు భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























