నాచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.దసరా తరువాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటివరకు సగం షూట్ కంప్లీట్ కాగా డిసెంబర్ లోగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇందులో సీనియర్ స్టార్ యాక్టర్ మోహన్ బాబు మంచు కీలక పాత్రలో కనిపించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.కానీ మూవీ టీం మాత్రం రెస్పాండ్ అవ్వలేదు.అయితే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఆ న్యూస్ నిజమేనని కన్ ఫర్మ్ చేసింది.నాన్న గారు ది ప్యారడైజ్ లో కనిపించనున్నారని తాజాగా ఓ ఈవెంట్ లో ఆమె అన్నారు.అయితే అఫీషియల్ గా టీం రివీల్ చేసిందనుకొని మంచు లక్ష్మి ఈ విషయాన్నీ లీక్ చేసింది.ఇక ఎలాగూ రివీల్ కావడంతో ది ప్యారడైజ్ టీం కూడా సినిమాలో మోహన్ బాబు ఉన్నారన్న విషయాన్నిఅధికారికంగా ప్రకటించనుంది.మరి శ్రీకాంత్ ఓదెల ,మోహన్ బాబును ఎలా చూపిస్తాడో చూడాలి.
రా & రస్టిక్ డ్రామాగా గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న ఈసినిమా భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























