కిష్కింధపురి ప్రీమియర్స్ టాక్ 

Kishkindhapuri Early Premiere Response

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి రేపే థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ట్రైలర్ తో సినిమాకు బజ్ వచ్చింది.ఇక ఈసినిమా మీద నమ్మకంతో నిన్న స్పెషల్ ప్రీమియర్ వేశారు.ఈ షో నుండి యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది.సినిమా బాగుందని రీసెంట్ టైంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని ముఖ్యంగా మ్యూజిక్ అదిరిపోయిందని అలాగే హారర్ సన్నివేశాలు బయపెట్టాయని టాక్ వస్తుంది. ఓవరాల్ గా సినిమా అయితే షూర్ షాట్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది.2గంటల 5 నిమిషాల రన్ టైం కూడా చాలా ప్లస్ అయ్యిందంటున్నారు.ఈరోజు కూడా ప్రీమియర్స్ వేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు.సినిమా విజయంపై మొదటి నుండి టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.ఇక ఇప్పుడు ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్ అడ్వాంటేజ్ కానుంది. దాదాపు 10 కోట్ల షేర్ టార్గెట్ తో కిష్కింధపురి థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా టికెట్ ధరలు అందరికి అందుబాటులో వుండనున్నాయి.నైజాంలో సింగిల్ స్క్రీన్ లలో 150 &మల్టీ ఫ్లెక్స్ 250 ఆంధ్రా లో సింగిల్ స్క్రీన్ 145 & 115 అలాగే మల్టీ ఫ్లెక్స్ 175 ధరల తో టికెట్స్ అందుబాటులోకి రానున్నాయి.షైన్ స్క్రీన్ ఈసినిమాను నిర్మించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.