టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటిసారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్వీట్లో.. ‘‘నా మిత్రురాలు, ఆప్తురాలైన లక్ష్మీ మంచుకి, ఆమె తదుపరి చిత్రం #దక్ష (Daksha)కు శుభాకాంక్షలు. మీకు ఆత్మీయమైన నా ప్రేమను తెలియజేస్తున్నాను. మీరు, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వంశీ కృష్ణ మల్లా @itsMVKrishna మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























