మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ (SYG). రోహిత్ కేపీ దర్శకత్వంలో, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అత్యంత కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం సాయి దుర్గతేజ్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ షెడ్యూల్‌లో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో సాయి దుర్గతేజ్ ఒక బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో తలపడనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం, అలాగే సినిమాలోని భావోద్వేగమైన పాత్ర కోసం సాయి దుర్గతేజ్ గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన ఫిజికల్, మరియు ఎమోషనల్ మేకోవర్ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను అద్భుతమైన రీతిలో ఆవిష్కరించడానికి భారీ స్థాయిలో సీజీఐ (CGI) వర్క్ కూడా జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, మరియు రవి కృష్ణ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘హను-మాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే తొలుత దసరాకు విడుదల చేయాలని భావించినప్పటికీ, పరిశ్రమలో సమ్మె కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తుంది. ‘SYG’ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాగా సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























