బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న లిటిల్ హార్ట్స్

Little Hearts Soars at Global Box Office With Massive Collections in 4 Days

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది ‘లిటిల్ హార్ట్స్’. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేనప్పటికీ, ఈ చిత్రం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹15.41 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విజయం కథా బలం, మరియు కంటెంట్‌కు ప్రేక్షకులలో ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన రోజునుంచీ పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకుల ఆదరణను చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ముఖ్యంగా యువతను, మరియు కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కేవలం 4 రోజుల్లోనే భారీ లాభాలను ఆర్జించిన ఈ చిత్రం, త్వరలో మరిన్ని రికార్డులను సృష్టించే దిశగా పయనిస్తోంది.

బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా, వసూళ్ల పరంగా పెద్ద సినిమాలతో పోటీ పడుతూ బాక్సాఫీస్‌ వద్ద ‘లిటిల్ హార్ట్స్’ విజయం సాధించింది. కాగా యువ నటీనటులు మౌళి తనుజ్ ప్రశాంత్, మరియు శివాని నాగరాం నటించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.