చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది లిటిల్ హార్ట్స్.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయగా రెండో రోజు అంత కన్నా ఎక్కువగా 4. 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక నిన్న అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో ఏకంగా 5. 42కోట్ల వసూళ్లతో మూడు రోజుల్లో 12.21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 20 కోట్ల వరకు రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి ,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా నటించిన ఈసినిమాను సాయి మార్తాండ్ తెరకెక్కించాడు.యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో కామెడీ హైలైట్ అయ్యింది . #90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.
నిజానికి మేకర్స్ ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్ ,వంశీ నందిపాటి సినిమాను చూసి కంటెంట్ నచ్చడంతో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. అలా థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తుంది.ఫుల్ రన్ లో బయ్యర్లకు భారీ లాభాలను అందించనుంది లిటిల్ హార్ట్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































