ముంబైలో ఫ్యాన్స్‌తో కలిసి హాలీవుడ్ సినిమా చూసిన రష్మిక, టైగర్‌ ష్రాఫ్

Rashmika Mandanna, Tiger Shroff Attends For Demon Slayer Screening in Mumbai

అనిమే అభిమానుల కోసం క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇండియా నిర్వహించిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో 250కి పైగా అభిమానులు పాల్గొనగా, ప్రత్యేక ఆకర్షణగా రష్మిక మందన్నా మరియు టైగర్ ష్రాఫ్ హాజరై అనిమే కల్చర్‌ను సెలబ్రేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక, టాంజిరో – నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక డ్రెస్సులో అభిమానులను అలరించగా, టైగర్ తన జెనిట్సు–ఇన్‌స్పైర్డ్ జాకెట్‌లో ఫ్యాండమ్‌ను ప్రదర్శించారు. అభిమానులతో మాట్లాడిన టైగర్, తనకు బాగా నచ్చిన సీన్ “జెనిట్సు vs కైగాకు” అని చెప్పారు. “అందరూ పడిపోయినా, జెనిట్సు మాత్రమే ప్రశాంతంగా కోటలోకి ప్రవేశించాడు” అని ఆయన గుర్తుచేశారు.

రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో “అకాజా vs గియు మరియు టాంజిరో” ఫైట్ సీక్వెన్స్‌కు థండరస్ రెస్పాన్స్ లభించింది. ఇక భారతదేశంలోనే అతిపెద్ద అనిమే థియేట్రికల్ రిలీజ్‌గా నిలిచే ఈ ఫిల్మ్‌ను థియేటర్స్‌లో తప్పక చూడాల్సిందిగా అభిమానులకు మేకర్స్ విజ్ఞప్తి చేశారు.

భారతదేశ వ్యాప్తంగా విడుదల:-

  • డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
  • 750కి పైగా స్క్రీన్లలో విడుదల – భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని స్థాయి రిలీజ్.
  • ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, జపనీస్ (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) భాషల్లో విడుదల.
  • రిలీజ్ డేట్: సెప్టెంబర్ 12, 2025.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.