ఓజీ గ్లింప్స్ రిలీజ్

OG Glimpse Released

హరి హర వీరమల్లు తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓజీ తో రానున్నాడు. కేవలం రెండు నెలల గ్యాప్ లోనే పవన్ రెండో సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. యంగ్ డైరెక్టర్ , పవన్ వీరాభిమాని  సుజీత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండడం అలాగే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఓజీకి మొదటి నుండి సూపర్ హైప్ వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రేపటి తో 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి  ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఉదయం పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హైప్ కు తగ్గట్లే వుంది. 65 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ ని ఒమీ గా పరిచయం చేయగా చివర్లో పవన్ ను చూపించారు. గ్లింప్స్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. చిన్న గ్లింప్స్ కే   ఇలావుంటే ఇక ట్రైలర్ వస్తే ఎలావుంటదో.

ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య  నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఓజీ పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలోకి రానుంది.

అయితే అదే డేట్ కి రావల్సిన అఖండ 2 వెనక్కి వెళ్లిపోవడంతో సోలోగా రిలీజ్ కానుండడం ఓజీకి మరింత అడ్వాంటేజ్ కానుంది. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఓజీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుపించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.