‘అమరన్’ ఫేమ్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’, ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మేము తమిళ్ నుంచి తెలుగుకి సినిమాలు తీసుకొస్తుంటాం. ఫస్ట్ టైం డైరెక్టర్ మురుగదాస్ గారి వలన తమిళ్లో చేశాం. శివ కార్తికేయన్ గారు ఈ సినిమాలో హీరో కావడం మా అదృష్టం. ‘అమరన్’ తర్వాత వస్తున్న ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీశాం.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శివ నిజాయితీపరుడు. కష్టపడి పైకి వచ్చాడు. శివకార్తికేయన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో విద్యుత్, బిజు మీనన్, రుక్మిణి వసంత్.. ఇలా అద్భుతమైన నటీనటులు వున్నారు. అనిరుద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పని చేశారు. సినిమా విజువల్ వండర్‌గా ఉంటుంది.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























