పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ మాములుగా లేదు. ఓవర్సీస్ లో అయితే రాంపేజ్ కొనసాగిస్తుంది.అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ లో ఇప్పటివరకు 3 లక్షల డాలర్ల ప్రీ సేల్స్ అయ్యాయి.పెట్టిన టికెట్లు పెట్టినట్లు అయిపోతున్నాయి.ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.ఓవర్సీస్ లోనే ఈవిధంగా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఇంకా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ గా సాంగ్ కాకుండా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు సెప్టెంబర్ 2న ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.త్వరలోనే ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన రానుంది.
సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ సరసన ప్రియాంక మెహన్ నటించగా అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి , ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి నిర్మిస్తున్నారు..సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున అఖండ 2 కూడా రావాల్సివుండగా వాయిదాపడింది. దాంతో ఓజీ సోలోగా రిలీజ్ కానుంది. హిట్ టాక్ వస్తే ఓజీ ఫుల్ రన్ లో 300 కోట్ల వసూళ్లను రాబట్టుకోనేలా వుంది.
ఇక పవన్ రెండు నెలల ముందు హరిహర వీరమల్లు తో రాగ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.ఇక ఇప్పుడు మరో నాలుగు వారాల్లో ఓజీ తో వస్తున్నాడు. మరి ఈసినిమాతో పవన్ సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























