మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ , నస్లీన్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర. డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక నిన్న ఈసినిమా మలయాళం లో రిలీజ్ అవ్వగా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. సినిమా సూపర్ అని కళ్యాణి యాక్టింగ్ , విఎఫ్ఎక్స్ , డైరెక్షన్ చాలా బాగుందని టాక్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు లో కొత్త లోక గా ఈరోజు విడుదలకావల్సివుంది. అయితే అనుకున్న సమయానికి కంటెంట్ డెలివరీ కాక పోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ , మ్యాటీ షోస్ క్యాన్సల్ అయ్యాయి.ఇక ఈరోజు సాయంత్రం నుండి తెలుగు వెర్షన్ షోస్ ప్రారంభం కానున్నాయని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. తెలుగులో ఈసినిమాను ఈ సంస్థే రిలీజ్ చేస్తుంది.
మరి మలయాళం లో సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో అడ్వాంటేజ్ కానుంది. జేక్స్ బిజోయ్ ఈసినిమాకు సంగీతం అందించగా తమిళ నటుడు , కొరియోగ్రఫర్ శాండీ మాస్టర్ కీలక పాత్రలో నటించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























