తమిళ హీరో శివ కార్తికేయన్ ,స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మదరాసి. బ్లాక్ బస్టర్ అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.రన్ టైం కూడా రివీల్ అయ్యింది.ఈసినిమాకు లెంగ్తి రన్ టైం సెట్ చేశారు. 2 గంటల 47 నిమిషాల నిడివితో మదరాసి థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది. త్వరలోనే తెలుగులోనూ ప్రమోషన్స్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.ఇక ఈసినిమా విజయం డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కి తప్పనిసరి కానుంది.గత కొన్నేళ్ల నుండి మురగదాస్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.మరి ఈసినిమాతో హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
కోలీవుడ్ లో ఈసినిమా పెద్దగా పోటీ లేకుండా విడుదలవడం అడ్వాంటేజ్ కానుంది. అయితే తెలుగులో అదే రోజు అనుష్క ఘాటి రిలీజ్ కానుంది. దాంతో మదరాసికి పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























