కోలీవుడ్ డైరెక్టర్ టర్న్డ్ హీరో ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. తమిళంలో ఈ సంస్థకు ఇది రెండో సినిమా. కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బూమ్ బూమ్ అంటూ సాగే ఈ సాంగ్ వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది.యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.. దీపావళికి రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. అయితే అదే టైం లో ఎల్ఐకె కూడా వస్తుంది.
ఇందులో కూడా ప్రదీప్ రంగనాథనే హీరోగా నటిస్తుండగా విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు.కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈసినిమా సెప్టెంబర్ లోనే రావాల్సింది కానీ అనుకున్న టైం కు రెడీ కాకపోవడంతో మేకర్స్ అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.ఇక డ్యూడ్ ముందు నుండి దీపావళికే స్టిక్ అయ్యి వుంది. మరి ఈరెండు సినిమాల్లో ఏది వెనక్కి తగ్గుతుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































