సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 25న విడుదలకావల్సివుండగా వాయిదాపడింది. ఈరోజు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి రీ-రికార్డింగ్, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేందుకు సమయం మరింత అవసరమని భావిస్తున్నాం.అందువల్ల, ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ 25 విడుదలను వాయిదా వేసి, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు.
అఖండ 2లో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.ఈసినిమా కూడా హిట్ అయితే బాలకృష్ణ వరుసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.ఇక అఖండ 2 వాయిదా పడడం తో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ – సుజీత్ ల ఓజీ సోలో గా విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























