డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.దాదాపు నెల రోజులకు పైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.వచ్చే నెలలో ఈ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లలో చాలా రోజులపాటు ట్రెండింగ్ లో కొనసాగింది.ఇక ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నెక్స్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి.ఆల్బమ్ అంతా అదిరిపోయేలా సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే ఛాన్స్ వుంది.
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.ఇందులో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























