చిన్న సినిమాగా తెరకెక్కి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ ఫిల్మ్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ ఏడాది సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని సంచలన విజయం నమోదుచేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషన్ జీవింత్ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు. అయితే దర్శకుడిగా కాదు, ఈసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ఈ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె, ప్రముఖ దర్శకురాలు సౌందర్య రజినీకాంత్ తన సొంత నిర్మాణ సంస్థ జియాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం మరో విశేషం. ఈ చిత్రంతో నటుడు అభిషన్ జీవింత్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మదన్ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.
కాగా అభిషన్ జీవింత్ ఇంతకు ముందు కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. ఈ కొత్త చిత్రంతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సినీ వర్గాల నుంచి సమాచారం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























