తండేల్ తో ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.అంతేకాదు ఈసినిమాతో మొదటిసారి 100 క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తన 24వ సినిమాలో నటిస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా రానుంది. ఫస్ట్ టైం నాగ చైతన్య డిఫ్రెంట్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి ఈసినిమా నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటుంది.అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈషూట్ జరుగుతుంది.ఇక ఈసినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో విలన్ పాత్రలో నటించాడు.లాపతా లేడీస్ లో హీరోగా నటించిన స్పర్ష్ శ్రీవాత్సవ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో నాగ చైతన్య స్టైలిస్ట్ లుక్ లో కనిపించనుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో తను దక్ష అనే పాత్రలో ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది.
ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























