తమిళ హీరో కార్తీ ,టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఖైదీ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా సెన్సేషన్ సృష్టించింది. ఈసినిమా తో లోకేష్ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.ఇక ఈసినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.లోకేష్ కూడా కూలీ తరువాత ఖైదీ 2నే చేస్తానని పలుసార్లు చెప్పుకొచ్చాడు. అయితే కూలీ రిలీజ్ అయ్యాక ప్లాన్ మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ హీరోగాను ఓ సినిమా చేస్తున్నాడు.అది కాకుండా ఖైదీ 2 ముందు మరో సినిమాను డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ , మరో సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ లతో డ్రీం ప్రాజెక్ట్ ను సెట్ చేసే పనిలో వున్నాడు.వీరిద్దరు కలిసి ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే లోకేష్ వీరిద్దరని కలుపనున్నాడు. వీరితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.ఆల్మోస్ట్ ఓకే కూడా అయిపోయినట్లే.దాంతో ముందు ఈసినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు.లేకుంటే డిసెంబర్ లో ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్ళేదే.
ఇక ఖైదీ 2 వాయిదా పడడంతో దానికి ఇచ్చిన డేట్స్ వేరే సినిమాకు అడ్జెస్ట్ చేశాడు కార్తీ.సుందర్ సి డైరెక్షన్ లో కార్తీ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.ఇప్పుడు ఈసినిమాకు ఖైదీ 2 డేట్స్ ఇచ్చేశాడు. సో డిసెంబర్ నుండి కార్తీ – సుందర్ సి ల సినిమా స్టార్ట్ కానుంది.అన్ని కుదిరితే ఖైదీ 2 వచ్చే ఏడాది ద్వితీయార్థంలో స్టార్ట్ కానుంది.
ఇక కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 , మార్షల్ సినిమాలు చేస్తున్నాడు.ఇందులో సర్దార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా మార్షల్ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.డ్రీం వారియర్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























