మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపించబోతున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ PCX స్క్రీన్‌లో నిర్వహించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఈ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థాంక్స్. ఆయన ఆట, పాట, మేనరిజమ్స్, ఫైట్స్, లుక్స్, ఫోజులు అభిమానించనివారు, అనుకరించనివారు తెలుగు ప్రేక్షకులలో ఎవరూ ఉండరు. ఎక్కడో ఒకచోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాంటి మెగాస్టార్‌ని నా కంటితో నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూపించబోతున్నాను.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమాలో చిరుకి కొన్ని మేనరిజమ్స్ పెట్టాం. అక్కడక్కడా అవి అలా వచ్చి వెళ్తుంటాయి. మ్యూజికల్‌గా కూడా ఈ మూవీ చాలా బాగుంటుంది. భీమ్స్ ఇప్పటికే అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేశాడు. చిరంజీవి గారి సినిమాలో పాటలు అంటే ఎలా ఉంటాయో.. ఆ రేంజ్ లోనే ఇందులో కూడా ఉంటాయి. ఖచ్చితంగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. బాస్ ఈసారి సంక్రాంతి పండుగకు వస్తున్నారు, గట్టిగా కొట్టబోతున్నారు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























