ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. గతంలో రికార్డులు సృష్టించిన ‘కాంతారా’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, చిత్ర యూనిట్ గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుల్షన్ దేవయ్యను ‘కులశేఖర’ అనే శక్తివంతమైన పాత్రలో పరిచయం చేశారు మేకర్స్. ఈ లుక్‌లో ఆయన కింగ్ గెటప్‌లో విభిన్నంగా కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టుతో, తలపై కిరీటంతో, మెడలో హారాలతో, రాచరిక దుస్తులలో ఠీవిగా ఉన్నారు. లుక్ చూస్తుంటే, ఈ పాత్ర చాలా బలమైనది మరియు కథలో కీలకమైనదని అర్థమవుతోంది. ఈ లుక్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తోంది. రిషబ్ శెట్టి ఈసారి కూడా అద్భుతమైన కథ, విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఈ లుక్ స్పష్టం చేసింది.
కాగా గుల్షన్ దేవయ్య తన నటనతో బాలీవుడ్లో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘కాంతారా’ వంటి పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం, ఆయన అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. గతంలో వచ్చిన ‘కాంతారా’ సినిమా గ్లోబల్ రేంజ్లో భారీ విజయం సాధించడంతో, ఈ తరుణంలో వస్తోన్న కాంతారా: చాప్టర్ 1పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఫిమేల్ లీడ్ ప్లే చేస్తోంది. అలాగే జయరామ్, రాకేష్ పూజారి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ కెమెరా వర్క్ నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























