‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పెద్ది’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ‘మీర్జాపుర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ‘రామ్ బుజ్జి’గా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’గా, జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌లోని లుక్స్‌కు భారీ స్పందన వచ్చింది. ఈ తరుణంలో త్వరలో చరణ్ మరిన్ని కొత్త లుక్స్‌తో రానున్నాడు. ఇందుకోసం ఆయన ప్రఖ్యాత హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ని కలిశారు. కాగా ఆలిమ్ హకీమ్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్‌లలో ఒకరు. హీరోలను స్టైలిష్ మేక్‌ఓవర్‌లలో చూపించడంలో ఆయనది అందెవేసినచేయి.
ఈ సందర్భంగా ఆలిమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. “కృతజ్ఞతలతో నిండిన హృదయపూర్వక ధన్యవాదాలు. జూబ్లీ హిల్స్ – హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించబడిన మా హకీమ్స్ ఆలిమ్ లైఫ్‌స్టైల్ సెలూన్‌ను సందర్శించి, మొత్తం బృందంపై ప్రేమను కురిపించినందుకు మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్ది సినిమా కోసం రాబోయే లుక్‌లను మాతో చేరి విడుదల చేసినందుకు దార్శనిక దర్శకుడు బుచ్చిబాబు సనాకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుకు ఉత్తేజకరమైన ప్రయాణాలు!” అని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే రానున్న రామ్ చరణ్ కొత్త లుక్స్ పెద్దిపై అంచనాలను మరింతగా పెంచేస్తాయని భావిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా చరణ్ బర్త్ డే కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది..
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























