పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ రిలీజై ఆ హైప్ ను మరింతగా పెంచేసింది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా నుండి ఈరోజు హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఇందులో తను పవన్ వైఫ్ గా కన్మణి పాత్రలో కనిపించనుంది. పవన్ సరసన నటిచడం ఆమెకు ఇదే మొదటి సారి.త్వరలోనే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ప్రోమో నుకూడా రిలీజ్ చేస్తామని ఓజీ టీం ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో శ్రీయా రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఓజీ పాన్ ఇండియా భాషల్లో థియేటర్లోకి రానుంది.హిట్ టాక్ వస్తే ఓజీ ఫుల్ రన్ లో 300 కోట్ల వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది.
ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.తన పాత్రకు సంబంధించి మరో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది. అక్టోబర్ లోపు టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























