సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ రివ్యూస్ తో మౌత్ టాక్ తో సంబంధం లేకుండా రాంపేజ్ కొనసాగిస్తోంది.మొదటి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించగా రెండో రోజు అదే జోరు కొనసాగించింది.రివ్యూస్ ఎఫెక్ట్ ఈసినిమాపై అసలు పడలేదు. దాంతో రెండో రోజు అన్ని చోట్ల స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.వరుసగా రెండో రోజు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళనాడులో అయితే సూపర్ స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది.రెండు రోజుల్లో అక్కడ 55 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వార్ 2 తో పోటీని తట్టుకొని అదరగొడుతుంది.రెండు రోజుల్లో తెలుగులో 35 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొంది.దాంతో సగానికిపైగా టార్గెట్ ను అందుకుంది.హిందీలో కూడా మంచి గ్రోత్ కనబరిచింది.నిన్నటి తో హిందీలో 10 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.
ఇక ఓవర్సీస్ లోనూ ఇదే జోరు కొనసాగిస్తుంది.ఓవరాల్ గా రెండో రోజు కూలీ ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అయితే ఈసినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా భారీగానే వుంది.600 కోట్లు రాబడితే కానీ సేఫ్ జోన్ లోకి రాదు.సో రానున్న రోజుల్లో కూలీ ఇదే రన్ ను కొనసాగించాల్సిన అవసరం వుంది.
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈసినిమాలో నాగార్జున విలన్‌గా నటించగా సౌబిన్ షాహిర్ ,ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరిశాడు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























