సూపర్‌స్టార్ రజినీకాంత్ సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో విడుదలైన ‘కూలీ’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఉత్సాహాన్ని చూసేందుకు స్వయంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమ అభిమాన దర్శకుడు, సంగీత దర్శకుడు తమతో ఉన్నందుకు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. లోకేష్ కనగరాజ్, అనిరుధ్ లతో కలిసి ఫ్యాన్స్ కేకలు వేస్తూ, డ్యాన్స్ చేస్తూ థియేటర్ ను హోరెత్తించారు. థియేటర్ లోని ఈ అద్భుతమైన వాతావరణాన్ని చూసి లోకేష్, అనిరుధ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ‘కూలీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మారింది. అంతకుముందు కూలీ విడుదల సందర్భంగా, నిన్న అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ థియేటర్ల దగ్గరకు భారీగా చేరుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, శృతి హాసన్, రియల్ స్టార్ ఉపేంద్ర, ‘కట్టప్ప’ సత్యరాజ్, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























