పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటైన ‘జల్సా’ సినిమాను 4K వెర్షన్లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ‘జల్సా’ రీ-రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మరోసారి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. పవన్ కళ్యాణ్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇప్పుడు 4K క్వాలిటీ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో ఈ సినిమాను చూడటం అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
అభిమానులు ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే కలెక్షన్లను ఛారిటీకి విరాళంగా ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే ఉన్న ప్రత్యేకత. గతంలో రీ-రిలీజ్ అయినప్పుడు, ‘జల్సా’ ఒక రీ-రిలీజ్ సినిమాకు అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు మళ్ళీ అదే రికార్డును తిరిగి సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మళ్లీ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ఫ్యాన్స్ నుండి వస్తున్న డిమాండ్ మేరకు, మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు థియేటర్లలో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సెప్టెంబర్ 2న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సందర్భంలో థియేటర్లలో పవర్ స్టార్ మేనియా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























