కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్‌కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్ట్ 8న ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మైత్రి నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ‘సు ఫ్రమ్ సో’ కన్నడలో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తారనే నమ్మకం వుంది. సినిమా తప్పకుండా ఆడియన్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా ఎంటర్‌టైన్ చేస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు.
అలాగే చిత్ర నిర్మాత ప్రొడ్యూసర్ రాజ్.బి.శెట్టి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్‌కి ధన్యవాదాలు. మేము ఇండీ ఫిలిం మేకర్స్. మంచి కంటెంట్ తీస్తే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేస్తారని నమ్మకం కలిగింది. ఇంత మంచి కంటెంట్‌ని ఆదరిస్తున్న మైత్రి శశి గారికి, నవీన్ గారికి థాంక్యూ సో మచ్. వారు లేకపోతే మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా కన్నడలో అద్భుతాలు సృష్టించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడు చూస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా గొప్పగా ఆదరిస్తారు. ‘గరుడగమన’ రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణ మర్చిపోలేను. మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























