కోలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఖైదీతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన లోకేష్ ఆ తరువాత విక్రమ్ , లియో లతో వరసగా రెండు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు.దాంతో ఈ డైరెక్టర్ నుండి నెక్స్ట్ వచ్చే సినిమాలపై హైప్ మాములుగా లేదు.ఇక లోకేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కూలీ. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా నాగార్జున విలన్ గా కనిపించనున్నాడు.అనిరుధ్ సంగీతం అందించాడు.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వగా ట్రైలర్ అనుకున్నంత రేంజ్ లో పేలలేదు.లోకేష్ ట్రైలర్ లో పెద్దగా ఏం చూపించలేదు.దాంతో ట్రైలర్ కట్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే సినిమా మాత్రం నిరాశ పరచదు అని ఇన్సైడ్ టాక్.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.శివ కార్తికేయన్ ,లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో పరాశక్తి తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఇందులో విలన్ ఆఫర్ ముందు లోకేష్ కే వచ్చిందట.లోకేష్ కి కూడా కథ బాగా నచ్చిందట.హీరో కూడా ఈ రోల్ లో చేయమని అడిగారట. అయితే కూలీ వల్ల కుదరలేదు అని లోకేష్ చెప్పుకొచ్చాడు.అలాగే కూలీ తరువాత నెక్స్ట్ ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 మొదలు పెట్టనున్నాని కూడా లోకేష్ వెల్లడించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























