అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘మనం’. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించడం విశేషం. తెలుగులో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో మనం సినిమా ఒకటి. అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ త్వరలో జపాన్‌లో విడుదల కానుండటం గమనార్హం. ఇది తెలుగు సినీ ప్రేమికులకు ఎంతో గర్వకారణంగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో నాగచైతన్య సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా ‘మనం’. మా కుటుంబమంతా కలిసి చేసిన ఈ ప్రయాణం, నా హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు అది జపాన్ ప్రేక్షకులను చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆగస్టు 8న జపాన్‌లో థియేటర్లలో విడుదల కానుంది” అంటూ ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నాడు చైతూ.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే తెరపై చూపించిన అరుదైన ప్రయత్నంగా నిలిచింది. ‘మనం’లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, శ్రియ మరియు సమంత కీలక పాత్రల్లో నటించారు. సెన్సిబుల్ ఎమోషన్స్, రిచ్ టెక్నికల్ వేల్యూస్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ జపాన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























