కూలీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్

Rajinikanth’s Coolie Trailer Receives Overwhelming Response

సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’. ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU)తో అప్రతిహత విజయాలను కొనసాగిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేయడం గమనార్హం. యాక్షన్ సన్నివేశాలతో పాటుగా అక్కడక్కడా శృతిమించిన హింస ఉండటంతో A సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. కాగా ఇది రజినీకాంత్ కెరీర్ లో తొలి ‘A’ సర్టిఫికేట్ చిత్రం కావడం విశేషం. కూలీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి.

అలాగే ‘చికిటు’ గ్లింప్స్, ‘మోనికా, పవర్ హౌస్’ పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన కూలీ థియేట్రికల్ ట్రైలర్‌ అయితే సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌ను ఊపేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనిగురించిన చర్చే. అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది.

ఇక కూలీ సినిమాలో రీసెంట్ ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటించగా.. ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్య పాత్రను పోషించారు. ఆగస్టు 14న కూలీ పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.