కింగ్డమ్.. రెండో రోజూ అదే హవా

Kingdom Continues Its Reign at Worldwide Box Office on Day 2

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత, రెండో రోజు కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలెక్షన్లు మెల్లగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీ, సీ సెంటర్స్‌లో ఈ సినిమా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో కింగ్డమ్ రూ.53 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సాలిడ్ ఫిగర్స్ రాబడుతోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రీమియర్స్ నుంచే మంచి క్రేజ్ కనిపించింది. కొన్ని లొకేషన్లలో ‘కింగ్డమ్’ దాదాపు హౌస్‌ఫుల్ షోలు నమోదు చేసింది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో మొదటి రోజే మిలియన్ మార్క్ దాటిన ఈ సినిమా, రెండో రోజున కూడా స్టడీ హోల్డ్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ జోరు ఇలాగే కొనసాగితే, మొదటి వారం చివరికల్లా కింగ్డమ్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.