కేరళలో రికార్డు సృష్టించిన కింగ్డమ్

Kingdom Sets New Record in Kerala

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 39కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. వర్కింగ్ డే లో కూడా ఈ రేంజ్ వసూళ్లు అంటే మాములు విషయం కాదు.ఇక ఈసినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది.అందులో భాగంగా తమిళనాడు లో కోటి రూపాయల వసూళ్లను అందుకోగా కేరళలో 50లక్షల వసూళ్లను రాబట్టింది.దాంతో కేరళలో ఈఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాగా అక్కడ రికార్డు సృష్టించింది.అక్కడ ఈసినిమాను దుల్కర్ సల్మాన్ సొంత సంస్థ వేఫెరర్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫస్ట్ డే యుఎస్ లో మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టుకోవడంతో 50 శాతం రికవరీ చేసింది.సీడెడ్ కూడా సగానికి పైగా రికవరీ చేసింది అలాగే నైజాంలో 8 కోట్లకుపైనే గ్రాస్ అందుకుంది.ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి.ఇదే జోరు కొనసాగితే ఆదివారం వరకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందించాడు.నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.ఇక ఎట్టకేలకు ఈసినిమాతో విజయ్ దేవరకొండ కం బ్యాక్ ఇచ్చాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.