మహావతార్ నరసింహ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 

Mahavatar Narsimha first week collections

 యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ దేశ వ్యాప్తంగా అదరగొడుతుంది.ఏమాత్రం అంచనాలు లేకుండా గత వారం విడుదలైన ఈసినిమాకు సూపర్ రివ్యూస్ రావడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.నిన్నటి తో  ఫస్ట్ వీక్  కంప్లీట్ అవ్వగా 53 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.నిన్న ఒక్క రోజే   ఈసినిమాకు బుక్ మై షోలో 2లక్షల 50 వేల టికెట్లు తెగాయి అంటే రన్ ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.ముఖ్యంగా హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ  దూసుకుపోతుంది.నిన్న ఒక్క రోజే 5.92 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 7 రోజుల్లో హిందీ వెర్షన్ 32.82 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈవీకెండ్ తో 50కోట్ల క్లబ్ లో చేరనుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగులో లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్  వసూళ్లను రాబట్టుకుంది.అయితే కింగ్డమ్ రూపంలో ఈసినిమా భారీ పోటీ ఎదురుకుంటుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మహావతార్ నరసింహకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.దాంతో ఉహించని ట్రెండ్ కొనసాగిస్తోంది.ఫుల్ రన్ లో ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకోనుంది.తెలుగులో ఈసినిమాను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. 

విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ మూవీని ప్రముఖ బ్యానర్ హోంబాలే ఫిలిమ్స్ నిర్మించింది. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కడంతో మహావతార్ నరసింహ నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.