తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమాను సార్ మేడమ్ అనే టైటిల్ తో తెలుగులో విడుదలచేస్తున్నారు.ఆగస్టు 1న విడుదలకానుంది.ఈసందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం.ఈసినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయింది.తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.నేనెప్పుడూ హైదరాబాద్ వచ్చిన తెలుగు ప్రజలు ఎంతగానో ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు.ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ సినిమాకి తెలుగు పాటలు రాంబాబు గారు చాలా చక్కగా రాశారు.వినసొంపుగా వున్నాయి.అందరూ రిలీట్ చేసుకునే కథ ఇది.ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను.రెండు నెలల కోర్స్ కూడా చేశాను.డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు.
నేను ఏ క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తూనే చేశాను.ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు ఈ కథని చాలా అద్భుతంగా రాశారు.చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం.నిత్యాతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది.మేము సినిమా గురించి, కథ గురించి, పాత్రల గురించి చాలా విషయాలు చర్చించుకుంటాము.ఈ సినిమా అంతా ఒక ఫ్యామిలీ ఎట్మాస్ఫియర్ లో జరిగింది.అందరూ థియేటర్స్ లో చూడండి.తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























