బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు ఈసాంగ్ ను వదలనున్నారు.హిందీతోపాటు ఏ మాత్రం ఆలస్యం లేకుండా తెలుగు ,తమిళ వెర్షన్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు అందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ప్రోమో అయితే చాలా బాగుంది. ఒరిజినల్ తెలుగు సాంగ్ వింటున్నట్లే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటలీలో అందమైన లొకేషన్ల లలో హృతిక్ ,కియరా అద్వానీ లపై చిత్రీకరించారు. ఇక మరో సాంగ్ ను హృతిక్ , ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.ఎన్టీఆర్ ఈసినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.హిందీతోపాటు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.నాగవంశీ భారీ ధరకు వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.
బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2కి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఆగస్టు 14న విడుదలకానుంది.అయితే ఈసినిమాకు తెలుగు ,తమిళంలో భారీ పోటీ ఎదురుకానుంది.అదే రోజన లోకేష్ కనగరాజ్ -రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























