బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడం తో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.దాంతో అఖండ 2 చెప్పిన తేదీకే రానుంది.
ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అవుతుంది.అఖండ కేవలం తెలుగులోనే విడుదలకాగా అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది.అయితే ఈసినిమా రిలీజ్ రోజునే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా విడుదలవుతుంది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అఖండ 2లో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.ఈసినిమా కూడా హిట్ అయితే బాలకృష్ణ వరసగా 5వ విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.
ఇక ఈసినిమా తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబోలో వీర సింహ రెడ్డి రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా కూడా రానుంది.సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది.వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























