ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

Ustaad Bhagat Singh Completes Shooting For Climax

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఆయన సరసన శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్‌ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయింది.

అలాగే ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్ళీ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తయింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను గ్రాండ్‌గా చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ స్టైల్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ ఎమోషన్స్, మాస్ డైలాగ్స్‌తో కూడిన సీన్స్ ఈ క్లైమాక్స్‌లో ఉండబోతున్నాయట. ఇక ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ అవతార్‌లో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం “క్లైమాక్స్ షూట్ పూర్తి కావడం సినిమాకు మరో కీలక దశ ముగిసినట్టే. త్వరలో మిగిలిన పనులు పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని తెలిపారు. కాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.