స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఒకవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ముందుగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో తెలుసు కదా చిత్రం నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘మల్లికా గంధ’ అంటూ సాగే ఈ సాంగ్‌కి కృష్ణకాంత్ సాహిత్యంగా సమకూర్చగా.. సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. ఎస్. తమన్ ఆకట్టుకునే ట్యూన్ అందించారు. మొత్తానికి ఈ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ టిజి విశ్వ ప్రసాద్ మరియు టిజి కృతి ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న తెలుసు కదా చిత్రాన్ని డైరెక్టర్ నీరజ కోన మనసుకి హత్తుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. సున్నితమైన ఈ ప్రేమ కథ పర్శనల్ గ్రోత్, రిలేషన్‌షిప్స్ మధ్య సాగుతుంది. అద్భుతమైన ఎమోషన్, హ్యుమర్‌తో ప్రేక్షకులని అలరించబోతోంది.
ఇక ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్‌గా కనిపిస్తూ చాలా మెచ్యూర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాకి జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తుండగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, షీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. తెలుసు కదా అక్టోబర్ 17న దీపావళి పండుగ సందర్భంగా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























