గత ఏడాది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది.నోవాటెల్ లో జరగాల్సిన ఈ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యింది. జనాలు ఎక్కువగా రావడంతో ఆర్గనైజర్స్ హ్యాండిల్ చెయ్యలేక చేతులెత్తేసారు.అయితే ఆ తరువాత సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక వార్ 2 కైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాకపోతే హిందీ సినిమా కావడంతో ఈవెంట్ వుంటుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల్లో వార్ 2ని నాగవంశీనే రిలీజ్ చేస్తున్నాడు.ఇందుకోసం వార్ 2 నిర్మాతలకు భారీగా చెల్లించాడు.సరైన టైం లో ఈవెంట్ జరిపి తెలుగులో హైప్ ను పెంచాలని చూస్తున్నాడు నాగవంశీ.ఇక నిన్న ట్రైలర్ రిలీజైన సందర్భంగా ఫ్యాన్స్ రెడీ గా వుండండి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ రానుందని నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ తోసహా వార్ 2 టీం అంతా హాజరుకానుంది.
ఇక నిన్న విడుదలైన వార్ 2 ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో హృతిక్ రోషన్ మరోహీరోగా నటించగా కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుంది.ప్రీతమ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఆగస్టు 14న వార్ 2 హిందీ తోపాటు తెలుగు తమిళంలో రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























