హ‌రిహ‌ర వీర మ‌ల్లుకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana Govt Approves Special Shows and Ticket Price Hike For Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్ -1’. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం. రత్నం ప్రత్యేక షోలు మరియు టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఆయన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు తాజాగా టికెట్ ధరల పెంపుకి ఆమోదం తెలుపుతూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, సినిమా విడుద‌లకు ముందురోజు రాత్రి (జూలై 23, బుధవారం) పెయిడ్‌ ప్రీమియ‌ర్‌కు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్, జూలై 24 నుంచి 27 వ‌ర‌కు రోజుకి ఐదు షోలు వేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక బుధవారం ఏర్పాటుచేయనున్న పెయిడ్‌ ప్రీమియ‌ర్‌ టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. దీనికి జీఎస్టీ అదనం.

ఇక ఆ త‌ర్వాతి షోల‌కు మ‌ల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేటుకు అద‌నంగా రూ.200, సింగిల్ స్క్రీన్స్‌లో అద‌నంగా రూ.150 పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మ‌ల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్ ధర రూ.531 ఉండగా.. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లలో రూ.354గా ఉండ‌నుంది. ఇక జూలై 28 నుంచి ఆగ‌ష్టు 2 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై అద‌నంగా రూ.106, మ‌ల్టీప్లెక్సుల‌లో టికెట్‌పై అద‌నంగా రూ.150 వరకూ పెంచుకోవ‌డానికి నిర్మాతకి అనుమతి ఇచ్చింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.