వ‌రుణ్ తేజ్ VT 15.. త్వరలో మ్యూజిక‌ల్ ప్రమోషన్స్

Mega Prince Varun Tej's VT15 Musical Promotions to be Start in Soon

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). “When haunting turns hilarious!!” అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి, గ్రాండ్ విజువల్స్‌ని క్యాప్చర్ చేశారు. షూటింగ్ చాలా స్పీడ్‌గా కంప్లీషన్ దిశగా వెళ్తోంది. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కంపోజింగ్ సెషన్స్ శర వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ పంచుకుంది. త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.

ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రానుండగా, తాజాగా హీరో వరుణ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇరువురూ కలిసున్న పిక్ ను పంచుకుంది చిత్ర బృందం. చూస్తుంటే, ఈసారి చార్ట్ బస్టర్ పక్కా అన్నట్టుగా ఉంది. ఈ సినిమా కోసం ఎస్ తమన్ అదిరిపోయే ఆల్బమ్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూట్ అయ్యాయి. ఇవి సినిమాకే హైలైట్స్ కానున్నాయి.

ఈ మేరకు చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా.. “బ్లాక్‌బస్టర్ బీట్‌లు సిద్ధమవుతున్నాయి! VT 15 సంగీత ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. వ‌రుణ్ తేజ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ ఇద్ద‌రిదీ బ్లాక్‌బస్ట‌ర్ మ్యూజిక‌ల్ కాంబినేష‌న్ కావ‌డంతో, ఈ ఆల్బమ్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే చిత్ర బృందం మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్రకటించింది. సో రెడీ అవ్వండి… మెస్మరైజ్ చేయ‌బోయే మ్యూజిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం” అని పేర్కొంది.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో ఇది వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. గతంలో వరుణ్ ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్‌లో ‘కంచె’ సినిమా చేశారు. అలాగే ‘తొలి ప్రేమ’ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ఇక మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని తీశారు. ఇప్పుడు మరోసారి ఈ అద్భుతమైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ రైడ్‌తో ఆడియెన్స్‌ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మొత్తానికి గ్రాండ్ స్కేల్, స్టైల్, హారర్ బ్లెండ్‌తో VT15 జానర్ డిఫైనింగ్ సినిమాగా వుండబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.