అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనల్ని ఎవడ్రా ఆపేది అని అభిమానులనుద్దేశించి ఆవేశంగా పేర్కొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కళ్యాణ్‌కి ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం ఇదే కావడం గమనార్హం. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్ సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కర్ణాటక అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు మూవీలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరైంది. ఇక పవర్ స్టార్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నా ఫస్ట్ ఫిల్మ్ ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’. ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అవుతోంది. వయసు పెరిగింది కానీ, గుండెల్లో చేవ మాత్రం చావలేదు. ‘బీమ్లా నాయక్’ రిలీజైనప్పుడు అందరి సినిమాల టెక్కెట్లు రూ. 100ల్లో ఉంటే నా సినమా టిక్కెట్ రూ. 10, రూ. 15 ఉండేది. ఆ రోజు నేను ఒకటే చెప్పాను.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఆ మాట డబ్బు కోసమో, రికార్డుల కోసమో చెప్పలేదు. ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం నిలబడ్డాం.”
“సినిమాలలో నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదు. జీవితంలో నేను పెద్దగా ఏమీ కోరుకోలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే కారణం అభిమానులే. ఎన్నోసార్లు పడ్డాను, లేచాను.. దానికి కారణం మీరే. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు. నా గుండెల్లో అభిమానులే ఉన్నారు. ‘జానీ’ సినిమా ఫెయిల్ అయినప్పుడుకూడా మీరు నన్ను వదల్లేదు. మీరే నా బలం.”
“ఎక్కువ రీమేక్స్ చేస్తుంటానని ఎక్కువగా అందరూ నన్ను తిడతారు. అయితే మనకేమీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేరు. కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా, వర్కవుట్ కాకపోతే అందరం నష్టపోతాం. అందుకే తప్పనిసరై కొన్నిసార్లు రీమేక్స్ చేశాను. నన్ను పరాజయాలు పలకరించినప్పుడు త్రివిక్రమ్ రూపంలో మంచి స్నేహితుడిని అందించాడు ఆ భగవంతుడు. ఆ సమయంలో ‘జల్సా’ సినిమాతో మంచి హిట్ అందించాడు. ఇక కీరవాణి గారి మ్యూజిక్ లేకపోతే హరిహర వీరమల్లు లేదు.”
“మనదేశంపై ఎంతోమంది ఎన్నోసార్లు దాడులు చేశారు. విలువైన సంపదను దోచుకున్నారు. మన సంస్కృతిపై కూడా దాడి చేశారు. ఒకప్పుడు హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ‘ఛత్రపతి శివాజీ’ అధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆయన స్పూర్తితో ఒక కల్పిత పాత్రను సృష్టించి క్రిష్ ఒక అద్భుతమైన కథను తయారుచేశారు. అది నాకు చాలా నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ సాధన చేశాను. క్లైమాక్స్ సీక్వెన్స్ డైరెక్ట్ చేశాను.”
“ఏపీ లోని కొల్లూరులో ‘కోహినూర్’ వజ్రం దొరికింది. అక్కడినుంచి చేతులుమారి ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉంది. ఈ ప్రయాణంలో వీరమల్లు చేసిన పోరాటం ఏంటి? అనేదే ఈ సినిమా. ఇది రేపు విడుదలయ్యాక ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను. కానీ మీ అందరినీ అలరిస్తుంది అని మాత్రం చెప్పగలను. నచ్చితే బ్లాక్ బస్టర్ చేయండి. బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి. ఈ గుండె ఎప్పటికీ మీకోసమే కొట్టుకుంటుంది. జై భారత్, జై హింద్” అని ముగించారు.
కాగా ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా హాజరు కావడం విశేషం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పవన్ సినిమాల పేర్లతో ఓ స్పెషల్ సాంగ్ తయారుచేసి ప్రదర్శించారు. పవన్ తొలిచిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుండి ‘హరిహర వీరమల్లు’ వరకూ ప్రతి సినిమాని టచ్ చేస్తూ సాగింది. ఈ సాంగ్ ప్లే చేసినప్పుడు అభిమానుల హోరుతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా హాజరు కావడం విశేషం. అలాగే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చేసిన ప్రసంగం ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ ఆయన మాటలకూ పడీపడీ నవ్వడం విశేషం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పవన్ సినిమాల పేర్లతో ఓ స్పెషల్ సాంగ్ తయారుచేసి ప్రదర్శించారు. పవన్ తొలిచిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుండి ‘హరిహర వీరమల్లు’ వరకూ ప్రతి సినిమాని టచ్ చేస్తూ సాగింది. ఈ సాంగ్ ప్లే చేసినప్పుడు అభిమానుల హోరుతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























